వాహన దారులు సాధారణ వేగం తో ప్రయాణించాలి అని బేగంపేట టీ టీ ఐ ఎ సి పి జి. శంకర్ రాజు అన్నారు.శుక్రవారం బేగంపేట , ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేట అద్వర్యంలో ESI మెడికల్ కాలేజ్ మరియూ హాస్పిటల్, సనత్ నగర్ విద్యార్థులకు మరియు వారి సిబ్బంధికి రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏ సి పీ మాట్లాడుతూ యువత ఎక్కువగా ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్ , సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారన్నారు గతంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 500 మాత్రమే జరిమానా ఉండేది, ఇప్పుడు అది రూ. 5000 వరకు విధించవచ్చు మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1,200 వరకు జరిమానా విధిస్తారు మరియు మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. అదే విదంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే థిస్. రూ 1700 లు జరిమానా విధిస్తారు అని చెప్పారు. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు తప్పని సరిగ లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పారు. వాహనాలు నిర్లక్ష్యంగా నడపటం ఎప్పుడూ ప్రమాదకరం అన్నారు. ముఖ్యంగా విద్యార్ధులు
ఈ వయసు నుంచే పట్టుదల, కృషి, ఆత్మ విశ్వాసం అలవర్చుకోవాలని అన్నారు. వారు అడిగిన పలు సందేహాలను ఏ సీ పీ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమములో 400 మంది విద్యార్ధులు సీతా మహాలక్ష్మి,రాధిక,కాకలి,పీ సీ ఆయన్ ,హెడ్ కానిస్టేబుల్ శ్రీ కృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.





