తాళ్లూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నవై విరమణయ్యకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ( సీఐ) గా పదోన్నతి కల్పిస్తూ ఐజి కార్యాలయం నుండి శనివారం ఉత్త ర్వులు వెలుపడ్డాయి. 2009 బ్యాచ్ కు చెందిన ఈ అధికారి జిల్లాలోని ఒంగోలు తాలూకా, ఒంగోలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్, టంగుటూరు, సింగరా యకొండ, ఉలవపాడు, పర్చూరు, కందుకూరు, నాగులుప్పలపాడు, తాళ్లూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు. టంగుటూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన కాలంలో మంచి అధికారిగా తనదైన మార్కును ఆయన సొంతం చేసుకున్నారు. విడుదలైన పదోన్నతుల జాబితాలో జిల్లాకు సంబంధించి ఆయన ఒక్కరే పదోన్నతిని దక్కించుకోవడం గమనార్హం. పదోన్నతి పొందిన వైవి రమణయ్యకు తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఉత్తర్వులు అనంతరం వై.వి రమణయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
