తలసాని శంకర్ యాదవ్ మృతి -కన్నీటి పర్యంతమైన తలసాని శ్రీనివాస్ యాదవ్ -….మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం వద్ద పలువురు ప్రముఖుల నివాళులు

మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ సోమవారం ఉదయం మృతి చెందారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్
సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.శంకర్ యాదవ్
బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.శంకర్ యాదవ్ మృతి వార్త తెలుసుకున్న తలసాని అభిమానులు.ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.విచారం వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కన్నీటి పర్యంతమైన తలసాని శ్రీనివాస్ యాదవ్

తన సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మృతి
తన సోదరుడి పార్దీవదేహం చూసి కన్నీరు పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్….మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం వద్ద పలువురు ప్రముఖుల నివాళులు

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన మాజీమంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్ది సుదర్శన్ రెడ్డి ,శంకర్ యాదవ్ తల్లి లలితా బాయ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిసిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *