కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రిగా ఎన్నికైన గంగాపురం కిషన్ రెడ్డి ( COAL AND MINES MINISTER ) నీ
బీ జె పీ నాయకులు చీరె సత్యనారాయణ (శ్రీకాంత్) మంగళ వారం ఢిల్లీ లోని కిషన్ రెడ్డి నివాసం లో మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియ జేశారు.సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందేందుకు కిషన్ రెడ్డి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని చీరె ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి నీ కల్సి అభినందించిన చీరె…….
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను బీ జే పి సీనియర్ నాయకులు చీరె సత్యనారాయణ (శ్రీకాంత్)మంగళ వారం డిల్లి లో కలిసి అభినందనలు తెలియజేశారు.బండి సంజయ్ కుమార్ బీ జే పి కి ఎంతో విధేయులుగా పనిచేశారని,ఆయన రాష్ట్ర బీ జే పి అధ్యక్షులు గా వున్న సమయం లో రాష్ట్రంలో పార్టీ బలపడిందని కేంద్రమంత్రిగా కూడా ఆయన మరింతగా పేరు
తెచ్చుకోవాలని చీరె ఆకాంక్షించారు.


