మాతాజీ నగర్ ఎఫ్ టీ ఎల్ లో అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలి…..ప్రజావాణి లో పిర్యాదు చేసిన బీ జే పీ నేతలు,బస్తీ వాసులు…..అక్రమ కట్టడాలు కూల్చి ప్రభుత్వ బోర్డు లు ఏర్పాటు చేయాలని వినతి……అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ బోర్డు లు ఏర్పాటు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం…..బీ జే పే నాయకులు నెమలి ఆనంద్…….

బేగంపేట మాతాజీ నగర్ హుస్సేన్ సాగర్ ఎఫ్ టీ ఎల్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు,ప్రార్ధనా మందిరాన్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళ వారం ప్రజావాణి లో మాతాజీ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు నరేష్,బీ జె పీ నేత నెమలి ఆనంద్ (నందూ)నేతృత్వం లో మహిళలు,బస్తీ వాసులు,బీ జె పీ నేతలు ప్రజాభవన్ కు వెళ్లి ప్రజావాణి లో అధికారులకు పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా బీ జే పి నాయకులు నెమలి ఆనంద్ (నందూ )మాట్లాడుతూ మాతాజీ నగర్ బస్తీ కి అనుకొని వున్న సర్వే నెంబర్ 194/8/1లో 10 ఎకరాల 20 గుంటల స్థలం వుందని,ఇది ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ గతం లో ఇక్కడ చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.అయితే తాజాగా కొందరు ఈ స్థలం లో నిర్మాణాలతో పాటు ఓ ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని,వెంటనే నిర్మాణాలను కూల్చివేయాలని వారు అధికారులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నమన్నారు.స్థలం లో నిర్మాణాలు చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేయాలని వారు కోరారు.అధికారులు నుంచి స్పందన రాకుంటే బీ జె పీ,మాతాజీ నగర్ బస్తీ వాసుల ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆనంద్ హెచ్చరించారు.హుస్సేన్ సాగర్ ఎఫ్ టీ ఎల్ స్థలం లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధన లు ఉన్నప్పటికీ ఇంటి నంబర్ల ఎలా ఇస్తున్నారని,విద్యుత్ మీటర్లు ఎలా ఇస్తారని ప్రజావాణి లో వున్న విద్యుత్ శాఖ డీ ఈ సుదీర్ నీ ప్రశ్నించామని.తాను విచారించి తగిన కాపీలను మీకు అందిస్తానని చెప్పినట్లు ఆనంద్ పేర్కొన్నారు.ప్రజావాణి కార్యక్రమం లో పిర్యాదు అందించిన వారిలో బేగంపేట బీ జె పీ డివిజన్ అధ్యక్షులు గోవింద్,ప్రధాన కార్యదర్శి మైసూర్ మదు, టీ.శ్రావణ్ కుమార్, పాండ్యన్,ప్రమోద్,సాయిలు,లక్ష్మణ్,చంద్రకళ,కృష్ణ,సునీత,శోభ,మంగ,ఉషా,గంగారాం,దేవిక తదితరులు వున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *