తలసాని శంకర్ యాదవ్ కు పలువురు నివాళులు…..

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ వర్తకుల సంఘం అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ కు పలువురు నివాళులు అర్పించచారు.
బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ శంకర్ యాదవ్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు.
వెస్ట్ మారేడ్ పల్లి లోని రాధికా కాలనీలోనీ శంకర్ యాదవ్ నివాసం నుండి అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది.
శంకర్ యాదవ్ కు తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బంధువులు, అభిమానులు, మిత్రులు తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
అంతిమ యాత్ర మోండా మార్కెట్ మీదుగా బన్సీలాల్ పేట లోని గ్రేవ్ యార్డ్ వరకు అంతిమయాత్ర సాగింది.ఈ అంతిమ యాత్రలో మాజీ మంత్రులు కే టీ ఆర్, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్, రాకేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వే సత్యనారాయణ, రోహన్ రెడ్డి
శంకర్ యాదవ్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి సంతాపం తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *