కేంద్ర రైల్వేలు, సమాచార మరియు ప్రసార, ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రిగా మంగళ వారం రైల్ భవన్‌లో అశ్వనీ శ్రీ వైష్ణవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
రైల్వే బోర్డు ఛైర్మన్ ,ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి జయ వర్మ సిన్హా , రైల్వే సీనియర్ అధికారులతో కలిసి రైల్ భవన్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు హౌస్ కీపింగ్ సిబ్బంది మరియు రైల్వే ఇతర అధికారులు కూడా మంత్రిని అభినందించారు.
ప్రధాని శ్రీ మోదీ నిర్దేశించిన దీర్ఘకాలిక దృక్పథాన్ని సాకారం చేసేందుకు తన వంతు అచంచలమైన నిబద్ధతను పాటిస్తానని శ్రీ అశ్విని వైష్ణవ్ మీడియా ను ఉద్దేశించి చెప్పారు. “రైల్వేలతో ప్రధాని మోదీకి ప్రత్యేక భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. భారతీయ రైల్వేలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా, సౌకర్యవంతమైన రవాణా మార్గంగా ఉండేలా వారి పరివర్తన దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మోడీ తనకు అప్పగించారని ఆయన పేర్కొన్నారు.
శ్రీ అశ్విని వైష్ణవ్ జులై 8, 2021న తొలిసారిగా రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, తన రెండవ విడత పదవికాలాన్ని నిరీక్షణను మరియు ఆశావాద దృక్పథంతో ప్రారంభించారు. మునుపటి పదవీ కాలంలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన దూరదృష్టితో కూడిన ఎజెండాకు అనుగుణంగా అనేక
వ్యూహాత్మక ప్రాజెక్టులను ప్రారంభించి, అమలు చేశారు. ఈ చొరవలో రైల్వే ఆధునీకరణ మరియు పునరుజ్జీవo వంటి అంశాలు ఉన్నాయి, వీటిలో స్టేషన్ రూపాంతరాలు, సరికొత్త రైళ్ల ప్రారంభం, సమగ్ర స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాలు, నూతన రైలు మార్గాలను ప్రారంభించడం మరియు విస్తృత విద్యుదీకరణ మొదలగు ప్రయత్నాలు ఉన్నాయి.
1970లో జన్మించిన శ్రీ అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. మాజీ ఐ.ఏ.ఎస్ అధికారిగా సుందర్‌ఘర్, బాలాసోర్ మరియు కటక్ ప్రజలకు జిల్లా కలెక్టర్‌గా సేవలను అందించారు. ఆ సమయం లో వారి మన్ననలను సైతం పొందారు .

