రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి …………….ప్రజా భవన్ లో ఆకట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫోటో గ్యాలరీ…………

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ప్రజాభవన్ లో ఏర్పాటుచేసిన రాజశేఖర్ రెడ్డి ఫోటో ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వైయస్ జయంతినీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఇతర మంత్రులు నాయకులు పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పంజాగుట్ట లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం గాంధీభవన్ లో కూడా వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల ప్రభుత్వాన్ని ,ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం, ప్రజల కొరకు అన్నట్లు గా పని చేశారన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేయాలని అన్నారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరుగుతున్న రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్భంగా నిర్వహించిన
భారీ బహిరంగ సభకి ముఖ్యఅతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తరలి వెళ్లారు. దీనిద్వారా ప్రజలందరికీ రాజశేఖర్ రెడ్డి చూపిన మార్గంలోనే ప్రజా ప్రభుత్వం పనిచేయాలని తెలియజేసారు. రాజశేఖర్ రెడ్డి భౌతికంగా లేకున్నా రాజకీయంగా ఇంకా బ్రతికే ఉన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా మార్గదర్శకంగా ఉన్నదన్నారు. రాజశేఖర్ రెడ్డి గొప్ప జాతీయ నాయకుడిగా పేరు పొందారని
అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *