దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలు వుంచి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం రాజశేఖర్ రెడ్డి చిత్రపటం వద్ద పూలు వుంచి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టీ అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అని అన్నారు.
