పోలీసులంటే చేతిలో లాటి సంకలో గన్ తో కన్పిస్తూ నేరస్థులను శిక్షించడమే కాదు అవసరమైతే చేతుల్లో పలుగు పారా పట్టి శ్రమదానం సైతం చేస్తామంటూ నిరూపించారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు. తిరుమలగిరి ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు చింతలకు గురవుతుండటాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆర్పి పాయింట్ వద్ద ఉన్న గుంతలను స్వయంగా పూడ్చారు. వాహనదారుల ఇక్కట్లను తొలగించారు. పోలీసులు చేపట్టిన ఈ చర్య ను వాహనదారులు స్థానికులు శభాష్ తిరుమలగిరిట్రాఫిక్ పోలీస్ అని అభినందిస్తున్నారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ సి మధు ఎస్ఐ రామచందర్ ఏఎస్ఐ రెడ్డి నాయక్ ఈ రమేష్ కానిస్టేబుల్స్ రత్నం తిరుపతి నాగేశ్వరరావు పవన్ తదితరులు పాల్గొన్నారు.



