రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు హైదరాబాద్ బుద్ధ భవన్ మహిళా కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసి అనంతరం బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన మంత్రులు దుద్దీళ్ల శ్రీధర్ బాబు ,సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు నేరెళ్ళ శారద ని శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం మంత్రులు మాట్లాడుతూ… మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. మహిళలకు నిత్యం అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు అభిమానులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



