ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అదుపులోకి తీసుకున్న వ్యక్తుల కారులో 25 లక్షల రూపాయలు విలువచేసే 28 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలానే ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ఉపయోగించిన కారును సీజ్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలకు తమిళనాడు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లుగా విచారణలో గుర్తించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ సురేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. పట్టుబడ్డ దొంగలను రిమాండ్ కు తరలిస్తున్నామని తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *