కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై దాడి

కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై ఒక వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన కరెంటు సిబ్బందిని తోటి సిబ్బంది స్థానికులు కలిసి ఈఎస్​ఐసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యుత్​ ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సనత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్​ సంఘ నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యుత్​ లైన్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న శ్రీకాంత్​, మీటర్​ రీడర్​ సాయి ఉదయం మోతీనగర్​ మీటర్​ రీడింగ్​కు వెళ్లారు. మోతీనగర్​లోని రాముల పేరిట ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయి రూ.9,858 చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు వచ్చి బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకొండని దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యుత్​ సిబ్బంది ఎంసీబీ ఆఫ్​ చేసి విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్​ నిలిపివేయడంతో పట్టలేని కోపంతో ఆ యువకుడు మీటర్​ రీడర్​ సాయి గణేశ్​ను పిడి గుద్దులతో తీవ్రంగా కొట్టి, మీదపడి తన్నాడు. అడ్డుకోబోయిన శ్రీకాంత్​ పై దాడి చేశారు. ఈ సంఘటనలో సాయి గణేశ్​ కుడి కన్ను, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ యువకుడిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి శ్రీకాంత్​ అతనిని వెంటనే ఈఎస్​ఐసీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుల పర్యవేక్షణలో అతడు చికిత్స పొందుతున్నాడు. వెంటనే బాధితులు సనత్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనత్​నగర్​ పోలీసులు బీఎన్​ఎస్​ చట్టం ప్రకారం 142, 115 క్లాజ్​-2 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విద్యుత్​ ఉద్యోగ సంఘం తీవ్ర ఆగ్రహం : మీటర్​ రీడర్​, లైన్​ ఇన్​స్పెక్టర్​పై జరిగిన దాడిని విద్యుత్​ ఉద్యోగ సంఘం తీవ్రంగా ఖండించింది. మీటర్​ రీడర్లపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని అన్నారు. దీంతో తాము ఉద్యోగం చేయాలా వద్దా అనే సంశయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనపై యూనియన్​ ప్రతినిధులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సంఘటనను సీఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. మీటర్​ రీడర్​పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *