పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలు లీగల్ సర్వీస్ అథారిటీ సేవలను వినియోగించుకోవాలని లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు బి సురేష్ కుమార్, ఎస్ డి రాకేష్ లు తెలియజేశారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ప్రిన్సిపాల్ జిల్లా సీనియర్ జడ్జ్ ,జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సెక్రటరీ కిరణ్ కుమార్ సూచనల మేరకు అల్వాల్ సఖి సెంటర్లో గృహ హింస చట్టం పై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్, రాకేష్ లు మాట్లాడుతూ మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను లీగల్ సర్వీస్ అథారిటీ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారికి సహాయం అందించేందుకు లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున తాము సిద్ధంగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా చట్టాలు,ఉచిత న్యాయ సహాయ సేవలను ఎలా పొందాలి అనే విషయాలను సభ్యులు మహిళలకు వివరించారు.

