వైసీపీకి గుడ్ బై చెప్పి, బిజెపి తీర్థం పుచ్చుకున్న జిల్లెల్లముడి రమాదేవి

ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పనిచేస్తూ, పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా మొదలై రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఎదిగిన, ఏపి సిపిడిసిఎల్ మరియు ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన జిల్లెల్లమూడి రమాదేవి శుక్రవారం విజయవాడ బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ నేతృత్వంలో ప్రపంచ దేశాలలో బలమైన నిర్ణయాత్మక దేశంగా భారతదేశ నిలిచి ఉన్నదని ప్రధాని మోడీ జనారంజక పాలన ఆచరణాత్మక విధానాలు నచ్చి భారతీయ జనతా పార్టీల చేరానని తెలిపారు రాబోవు రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా శాయశక్తుల కృషి చేస్తూ… అధిష్టానం ఇచ్చే ఎలాంటి బాధ్యతను అయినా సక్రమంగా నిర్వహిస్తూ… రాష్ట్రంలో సైతం బిజెపి ప్రభుత్వం వచ్చే దిశ గా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *