బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటిఓ జంక్షన్ లో ఓ వ్యక్తి స్పృహతో పడి ఉన్నాడని ఈనెల 14వ తేదీ ఉదయం 6:30 కు డయల్ 100 కు సమాచారం అందింది.వెంటనే బేగంపేట పోలీసులకు సమాచారం అందింది.ఇన్స్పెక్టర్ రామయ్య ఆదేశాల మేరకు బీ సి 4లో విధులు నిర్వర్తిస్తన్న పీ సీ షేక్ అజ్జు ,హెచ్ జి శంకర్ నాయక్ తో కల్సి పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నదన్నారు .వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 108కి సమాచారం ఇచ్చి సుమారు 40ఏళ్ల వయసు వున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.చికిత్స పొందుతూ ఆవ్యక్తి 17వ తేదీన మృతి చెందినట్లు బేగంపేట పోలీసులకు సమాచారం అందింది అన్నారు.మృతుని ఆచూకీ తెలిసిన వారు బేగుపేట పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సైజే.నాగరాజు తెలియజేశారు.
