మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2023-2024 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల్లో రూ. 42 లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఈమేరకు సామాజిక తనిఖీలో గుర్తించారు. ఇందుకుసంబంధించి శని వారం నిర్వహించిన ప్రజావేదికలో పీడీ అర్జునరావు పాల్గొన్నారు.
ఏప్రిల్ 2023 నుండి మార్చి2024 వరకు ఉపాధి పదకం కింద 839 పనులకు రూ.9 కోట్ల 12లక్షల 93 వేల నిధులు ఖర్చు చేశారు. ఈ తనిఖీలో దాదాపు
రూ.42 లక్షల నిధులు దుర్వినియోగం జ రిగినట్లు గుర్తించారు. ఆడిట్ లో డీఆర్పీలు గుర్తించిన ఆవకతవకల్లో ప్రజావేదిక పరిశీలన అనంతరం రూ.2 లక్షల 61వేల నగదు రికవరి చేస్తున్నట్లు పీడీ తెలిపారు. ఎక్కువగా మస్టర్లలో దిద్దుబాటు, కొట్టివేతలు ఉన్నాయని, కూలీలు సంతకాలు పెట్టకుండానే బిల్లులు చెల్లింపులు జరిగాయని, నాటిన మొక్కలు చాలావరకు తేవని, గ్రామాల్లో జరిగిన పనుల వద్ద పనుల వివరాలు తెలిపే బోర్డులు లేవని సామాజిక తనిఖీ బృందం డీఆర్పీలు వెల్లడించారు.
ప్రజావేదిక అనంతరం డ్వామా పీడీ అర్జునరావు మాట్లాడుతూ మండలంలో ఉపాధి కింద చేపట్టే పనుల నిర్వహణకు ఎర్రర్ రిజిస్టర్ వినియోగించక పోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. బాధ్యతగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటి కొండ శ్రీనివాసరావు , జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎంపీడీవో కె.యుగకీర్తి, జిల్లా డ్వామా విజిలెన్స్ అధికారి ఝాన్సీ, ఇన్చార్జ్ ఏపీడీ నిర్మలాదేవి, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం లో ఉపాధి’లో రూ.42 లక్షలు దుర్వినియోగం – సామాజిక తనిఖీలో గుర్తింపు -ప్రజావేదిక పరిశీలన అనంతరం -రూ.2 లక్షల 61 వేలు రికవరీ
21
Jul