భక్తిశ్రద్ధలతో గుంటి గంగా భవాని కి సారె

తాళ్లూరు మండలంలోని గుంటిగంగలో ప్రఖ్యాతిగాంచిన గంగాభవాని అమ్మవారికి శనివారం భక్తులు సారె సమర్పించారు. ప్రస్తుతం ఆషాడమాస ప్రాధాన్యతతో తూర్పుగంగవరం, తాళ్లూరు గ్రామానికి చెందిన భక్తులు భక్తిశ్రద్ధలతో గుంటిగంగకు వద్ద కు తరలిచ్చారు. మహిళా భక్తులందరూ అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మిఠాయిలు తీసుకొచ్చి సారె సమర్పించారు. అనంతరం భక్తులందరూ గుంటిగంగ వద్ద నుంచి ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు వెళ్లి అక్కడ కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *