మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గేదెలను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ధర్మవరం కు చెందిన గజ్జల శివయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ఒకరికి తీవ్ర గాయాలు ,మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో ఒంగోలు తరలించారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు వరకు ఉన్నారు.
స్వల్ప వేగంతో బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు వెంటనే బయటికి వచ్చి వారి గమ్యస్థానాలకు వేరే వాహనాల్లో తరలి వెళ్లారు.
