తాళ్లూరు మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

తాళ్లూరు మండలంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపాలెం, నాగంబొట్లపాలెం, వెలుగువారి పాలెం షిర్డి సాయి బాబ దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసారు. స్వామి వారిని హారతి ఇచ్చారు. సాయి భక్త బృందం ఆధ్వర్యంలో భారీగా ఐదు వేల మందికి అన్నదానం చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నదానంనకు కావలసిన బియ్యంను అందించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణారెడ్డి పలువురు గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిథులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వెలుగు వారి పాలెంలో సాయి బాబ ఆలయం ప్రాంగణంంలో మయూరి నాట్య కళా మండలి ఆధ్వర్యంలో పొదిలి, బొద్దికూరపాడు గ్రామాలకు చెందిన చిన్నారులు మామిడి శివశంకర్ మాస్టార్ ఆధ్వర్యంలో భరతనాట్య, జాన పద నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *