తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ,బొటని డిపార్ట్మెంట్ మరియు ఇకో క్లబ్ , బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి పై అవగాహన కార్యక్రమం తో పాటు క్విజ్ ప్రోగ్రాము మట్టి గణపతి తయారికి సంబంధించిన వర్క్ షాప్ ను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు విభూతి కల్చరల్ సొసైటీ ద్వారా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పర్యావరణ పరిరక్షణకు మరియు సాంప్రదాయ పద్ధతులు ప్రకారంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు మట్టితో తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాలను వినియోగించి సహజ వనరులను పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం విద్యార్థులచే మట్టితో గణేష్ ను తయారు చేపించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల తరుపున సర్టిఫికెట్లను అందించారు విభూతి బ్రదర్స్ ఆధ్వర్యంలో కల్చరల్ టీమ్ వారి ద్వారా పాటలతో విద్యార్థులను అలరించారు ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వసుధ. ,డాక్టర్ కె ఉషారాణి ఇంచార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డ్ బోటనీ మరియు ECO క్లబ్ కన్వీనర్, IQAC Coordinator Dr T.Annie sheron, మరియుఇకో క్లబ్ మెంబర్స్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు డాక్టర్ ఆర్ స్నేహ ప్రవీణ ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

