అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) – 2.0 పధకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒడిషాలోని భువనేశ్వర్ లో విడుదల చేశారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తోపాటు జిల్లా హౌసింగ్ అధికారి పి. శ్రీనివాస ప్రసాద్, ఇతర ఈ.ఈ.లు, డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.ఈ.లు, వర్క్ ఇన్ స్పెక్టర్లు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇళ్ల లబ్దిదారులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇళ్ల మంజూరు పత్రాలను, పూర్తయిన ఇళ్లకు సంబంధించిన తాళాలను వారి చేతికి కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎల్.డి.ఎం. రమేష్, మెప్మా పిడి. రవికుమార్,డి.ఆర్.డి.ఏ. పిడి. వసుంధర, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
