దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తాళ్లూరులో బుధవారం పలువురు ప్రజా ప్రతినిథులు, నాయకులను పరామర్శించారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచి ఇడమకంటి పెద్ది రెడ్డి నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసారు. పార్టీ కార్యకర్త ఐ. గోపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, సొసైటీ అధ్యక్షుడు జయ రామిరెడ్డి, కోట మన్నే రెడ్డి, దేవదానం తదితరులు పాల్గొన్నారు.
