రైతులకు ఉపయోగపడే పనులను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గుర్తించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు కోరారు. తాళ్లూరులో బుధవారం ఎంఎస్ఆర్ఆజీఎన్ ప్రాంగణంలో గ్రామ సభను నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ సాగర్ కాలులలో నీరు వస్తున్నందున బాగా పిచ్చి చెట్లు పెరిగిన కాలువలను గుర్తించి పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్ చేసే విధంగా పనులను గుర్తించాలని కోరారు. ఎంపీడీఓ సానికొమ్ము సత్యం మాట్లాడుతూ పారదర్శకంగా పనులు గుర్తించాలని చెప్పారు. ఎపీఓ మురళి మాట్లాడుతూ మండలంలో 78 పనులు మంజూరు అయినట్లు ఆయా గ్రామాలలో గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు ఉద్యాన వన మొక్కలు నాటుకునేందుకు, ప్రభుత్వ పాఠశాలలో మొక్కల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సర్పంచి చార్లెస్ సర్జన్, గ్రామకార్యదర్శి నూర్ అహ్మాద్, ఈసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

