ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైనడాక్టర్ నూకసాని బాలాజీ కి శుభాకాంక్షలు తెలిపిన కావలి, నెల్లూరు జిల్లా, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు… నూకసాని బాలాజీ ని భారీ గజమాలతో సత్కరించిన కావలి జవహర్ భారతి కళాశాల మిత్ర బృందం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ని కావలి జవహర్ భారతి కళాశాల పూర్వ మిత్రులు కెవివి సత్యనారాయణ స్వామి, కావలి జవహర్ భారతి కళాశాల విద్యార్థి యూనియన్ మాజీ అధ్యక్షులు & మున్సిపల్ మాజీ కౌన్సిలర్ షాహల్ హమీద్, ఎం వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఎంపీడీవో గుడ్లూరు, ఎం వాసు, ఎం వెంకటేశ్వర్లు ఒంగోలు, పోలిశెట్టి వెంకట సురేష్ అడ్వకేట్ కావలి, నెల్లూరు జిల్లా మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పెంచల బాబు యాదవ్ , రవీంద్రబాబు మాజీ ఎంపీపీ దుత్తలూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ప్రజలు, నాయకులు కలిసి భారీ గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా కావలి జవహర భారతి కళాశాల విద్యార్థి యూనియన్ మాజీ అధ్యక్షులు & మున్సిపల్ మాజీ కౌన్సిలర్ షాహల్ హమీద్ మాట్లాడుతూ… మా అన్న డాక్టర్ నూకసాని బాలాజీ భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో శ్రీ హర్షిని విద్యా సంస్థలు చైర్మన్ గోరంట్ల రవికుమార్, కొండేపి నియోజకవర్గ జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, పసుపుగల్లు మాజీ సర్పంచ్ చింతా పిచ్చిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వరగాని పౌల్ చీరాల నియోజకవర్గమునకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్.ఆర్ టెక్స్టైల్ అసోసియేషన్ సభ్యులు సూరత్ సత్యం, కాకపర్తి సుబ్బారావు, ఎం వెంగళరావు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *