మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి కి ఘన నివాళులర్పించిన బీసీ సంఘాలనాయకులు

దరిశి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో నాయి బ్రాహ్మణ సేవ సంక్షేమ సంఘం రాష్ట్రదళితసేన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత మూడోప్రధాని మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రివర్యులు లాల్ బహుదూర్ శాస్త్రి120వ జయంతిసభ నిర్వహించారు.
అన్నవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్, అన్నవరపు వెంకటేశ్వర్లు, రాష్ట్రదళితసేన దర్శినియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ లు మాట్లాడుతూ ….బడుగు బలహీనవర్గాల నుండి పుట్టి అంటరానితనం కులవివక్ష ఉన్న కాలంలో భారతదేశంలోనే మూడవ ప్రధానిగా కొనసాగిన మహా మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి అని వారు కొనియాడారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో నాయి బ్రాహ్మణుల సేవా సంఘం నాయకులు ధరణికోట పిచ్చయ్య , దర్శి ప్రసాదు, వంగపార్టీ శ్రీను, రాష్ట్రదళితసేన దర్శి నియోజకవర్గ ప్రధానకార్యదర్శి రాచపూడి మోషే, మాదిగ మహానాడుజిల్లాఅధ్యక్షుడు గట్టుపల్లి ప్రసాద్, ప్రకృతివైద్యనిపుణులు, వై వి రెడ్డి, మిట్ట రమేష్, గుంటూరు ఏసుదాస్, సంజు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *