భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి లాల్ బహుదూర్ శాస్త్రికి ఘన నివాళులు అర్పించారు.దర్శి పట్టణంలో నగర పంచాయతీ వద్దగల మహాత్మ గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రికి దరిశి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమా లలో జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి ఆర్టికల్ సెల్ జిల్లా కన్వీనర్ నాగభూషణాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏవి నారాయణరెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు , దర్శి రూరల్ మండలాధ్యక్షుడు కాకర్ల నాగసాయి, యువ నాయకులు అనిల్ బచ్చు, అనిల్ కొండలు, అచ్యుత ప్రసన్నకుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు


