రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదకరం:-అతి వేగంతో వాహన ప్రయాణం అంతిమ ప్రయాణంఅవుతుంది-రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత:- బేగంపేట టిటిఐ ఎసిపి జి. శంకర్రాజు

రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ. సి.వి. ఆనంద్ మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మంగళవారం మలక్ పేట లోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 2024లో ఇప్పటి వరకు 2,97,000 కేసులు బుక్ అవ్వగా ఒక వ్యక్తి మరణించగా, 128 మంది గాయపడ్డారు, గతేడాది ఎనిమిది మంది మరణించగా, 150 మంది గాయపడ్డారని తెలిపారు. మోటార్ వెహికల్ చట్ట ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే సెక్షన్ 119/177 మరియు 184 ప్రకారం శిక్షార్హమైనది లేదా FIR U/s 281 BNS కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు. స్పెషల్ డ్రైవ్ సమయంలో, చాలా మంది ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో మెడికల్ ఎమర్జెన్సీలకు హాజరుకావాలని అంటున్నారు. అత్యవసర పరిస్థితుల సాకుతో కొంత దూరం తప్పించుకోవడానికి, వారు రాంగ్ సైడ్ డ్రైవింగ్లో మునిగిపోతారు, ఇది వారి ప్రాణాలకు మరియు ఇతర వాహనదారులు లేదా పాదచారుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుందని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగ లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. ఈ సంవత్సరం 1575 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి టి.టి.ఐ బేగంపేట నందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం మరియు రోడ్డు మీద ఆదమరచి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. ఇట్టి కార్యక్రమములో సుమారు 50 మంది ఐసీఐసీఐ ఉద్యోగులు, బ్రాంచ్ మేనేజర్ నవీన్ సింగ్, అడ్మిన్ శ్రీవాత్సవ్ మరియు హీరో మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ సాదిక్ సాగర్, అబ్దుల్ మాజిద్ హెచ్. జి. అధికారి టిటిఐ బేగంపేట పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *