5050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీఎస్సీలో శిక్షణ – జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి లక్ష్మానాయక్ వెల్లడి

సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా 5050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియన్ విధానంలో డీఎస్సీలో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్ వెల్లడించారు. ఈ శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన శిక్షణ సంస్థలలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్స్ లో నిర్వహించబడునని చెప్పారు. శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి ఉన్న డీఎస్సీ కోచింగ్ సెంటర్స్ సైతం నిబంధనలు అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కోచింగ్ (ఈ ఓ ఐ)లు దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేది ఈనెల 21 అని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *