పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీ. ఎన్. బి ) వృధ్ధాశ్రమానికి, వైద్యశాలకు రూ. 50వేల విలువైన సామగ్రిని అందజేసారు. గుంటి గంగాలో ఉన్న తేజ వయో వృద్ధాశ్రమానికి డబుల్ డోర్ ఫ్రిజ్ ను అందజేసారు. పీ.ఎన్.బి విజయవాడ సర్కిల్ హెడ్ అభిజిత్ సిన్హా, సర్కిల్ చీఫ్ మెనేజర్ ఉదయ్ కుమార్, దర్శి బ్రాంచి మెనేజర్ నరేంద్రలను ఆశ్రమాన్ని సందర్శించి నిర్వాహకుడిని అభినందించారు. ఆశ్రమ అవసరాలకు కోసం తమ బ్యాంకు సామాజిక బాధ్యతగా తగిన చేయూత ఇస్తామని తెలిపారు. అనంతరం తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. వైద్యశాల అవసరాల నిమిత్తం బీరువా, మూడు ర్యాక్ లు అందజేసారు. వైద్యశాల వైద్యుడు డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ .ఈ .ఓ చంద్రశేఖర్ బాబు, హెచ్ఎస్ సుశీల లు పాల్గొన్నారు.

