జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయటమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది ముఖ్యమైన జంక్షన్ లు , ఆర్టీసీ బస్టాండ్ లు , రైల్వే స్టేషన్ లు , లాడ్జిల మరియు ఇతర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను విచారిస్తూ ముమ్మరంగా గస్తీలు, పెట్రోలింగ్, నైట్ బీట్ చెకింగ్ లు నిర్వహిస్తున్నారు. అర్దరాత్రి వేళల్లో అనుమానాస్పందంగా సంచరిస్తున్న అపరిచితుల వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టి గంజాయి, అక్రమ మద్యం, నాటు సారా, తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.




