డీఎస్సీ ఉచిత శిక్షణకు 10న అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష -ఒంగోలులో మూడు కేంద్రాల ఏర్పాటు-అధికారులతో ఏర్పాట్లపై డీఆర్వో సమీక్ష

త్వరలో జరగనున్న డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల ఎంపికను ఈ నెల 10వ తేదీన చేపట్ట నున్నారు. ఇందుకోసం స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిం చేందుకు అధికారులు ఒంగోలులోని మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. డీఎస్సీ పోటీ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో కోచింగ్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్లను కూడా ఎంపిక చేసింది. అభ్యర్థు లకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం దర ఖాస్తులు కోరగా మొత్తం 13,982 దరఖాస్తులు రాగా వీటిలో జిల్లా నుంచి 583 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈ నెల 10వ తేదీన స్థానిక వెంగ ముక్కపాలెం రోడ్డులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల, పేస్ ఇంజనీరింగ్ కళాశాల, రైజ్ ఇంజనీరింగ్ కళా శాలలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం హాజ రయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎన్. లక్ష్మానాయక్ కోరారు. ఎంపిక పరీక్షకు సంబంధించిన అన్న వివ రాలను అభ్యర్థుల సెల్ ఫోన్ ల కు మెసేజ్ ద్వారా తెలియజేశామని ఆయన తెలిపారు. హాల్ టికెట్ తో
పాటు ఒరిజనల్ ఆధార్ కార్డు తో హాజ రుకావాలన్నారు. ఈనేపథ్యంలో గురు వారం సాయంత్రం స్థానిక డీఆర్వో, కార్యాలయంలో డీఆర్వో చిన్నఓబు లేషు ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వ హించే నిర్దిష్ట సమయానికి అరగంట ముందు మాత్రమే అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించాలన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహి స్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసు కోవాలని చెప్పారు. సాంకేతిక సమస్యలను తల్తె కుండా సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు, వైద్యశిబిరం, పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీడీ లక్ష్మానాయక్, జిల్లా గిరిజన సంక్షేమశాఖాధి కారి జగన్నాథరావు, డీఎంహెచ్ ఓ సురేష్ కుమార్, శింగరాయకొండ సీఐ హజరత్తయ్య, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *