ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని చలివేంద్ర కొండపై ఏడు నెలల పసిపా పను చంపి పడేసిన దారుణ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పొదిలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ బుధవారం రాత్రి ఆ పాపను తీసుకొని చలివేంద్ర కొండకు వచ్చింది. అక్కడ కొలువుదీరిన వెంకటేశ్వ రస్వామి వద్ద పూజలు చేసి రాత్రి అక్కడే నిద్ర చేయాలని నిర్ణయించుకుంది. ఆలయ నిర్వాహకులు ఆమెకు అక్కడ అందుకు అవసరమైన ఏర్పా ట్లు చేశారు.
గురువారం ఉదయం తెల్ల వారుజామున నాలుగున్నర గంటలకు ఆ మహిళ నిద్రలేచి తన పాపతో తిరుగు ప్రయాణ మైంది. ఇంత చీకట్లో ఎక్కడకు వెళ్తావని నిర్వాహకులు అ
డగ్గా, తన భర్త ఫోన్ చేయ డంతో వెళ్తున్నానని ఆమె చెప్పింది. దీంతో వారు మిన్న కుండిపోయారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు కొండ మధ్యలో మెట్ల వద్ద చిన్నారి మృతదేహం కనిపించింది. సత్రంలో పనిచేసే మహిళ పొదల్లో ఉన్న చిన్నారిని చూసి కొండపైన ఉన్న వారికి సమా చారం ఇచ్చారు.
అక్కడ పరిశీలించగా చిన్నారి తల్లి బట్టలు కూడా అ క్కడే ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా, దర్శి ఎస్ఐ ఎం .మురళీ హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరి శీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

