రాష్ట్రంలో శాంతిభద్రతలకువిఘాతం కలిగిస్తున్న మాజీ సీఎం జగన్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి- రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు యత్నిస్తూ, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. తూర్పుగంగవరం గ్రామంలో ఓ శుభకార్యక్రమంకు శుక్రవారం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ల జగన్ రాక్షస పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దెబ్బతినగా సీఎం చంద్రబాబు నేతృ త్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్రాభివృద్దిని చూసి ఓర్వలేక పోతూ వైయస్ జగన్ రాష్ట్రంలో కులాలు, వర్గాల పేరుతో వైషమ్యాలు సృష్టిం చేందుకు కుటిల ఎత్తులు వేస్తున్నారన్నారు. జగన్ పాలనలో సాగిన అరాచక పాలనవల్ల పెట్టుబడి దారులు రాష్ట్రంలోకి రాకుండా పోయాన్నారు. అభివృద్ధిని ఆదుర్వినియోగం చేసిన మాజీ సిఎం జగన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయవచ్చునన్నారు. మరళా తాను సీఎం అవుతానన్న భ్రమతో వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి వార్నింగ్ లు ఇవ్వటం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో మరళా వైసీపీ ప్రభుత్వం రావటం జరగని విషయమని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. సీఎం చంద్రబా బుపాలనలో రాష్ట్రం ప్రశాంతంగా వుండి అభివృద్ధి పథంలోముందుకు సాగుతుం డగా ఏదోవిధంగా అశాంతి కల్గించే యత్నాలు చేస్తున్నందున, జగన్ ను అరెస్టు చేయటం శ్రేయస్కరమన్నారు. ఎమ్మార్పిఎస్ నేత మంద కృష్ణ మాదిగ హోంమంత్రి అనితకు మద్దతుగా మాట్లాడిన మాటలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వక్ర భాస్యం చెబుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య దూరంపెంచేందుకు చేస్తున్న ఎత్తులు సాగవన్నారు. కూటమి పార్టీలు విడిపోవని కలిసి కట్టుగా భవిష్యత్తులో కూడా ప్రయాణిస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు త్రిముఖ్య వ్యూహంతో ముందుకు సాగుతున్నారని , రాష్ట్రం అన్ని రంగాలలో అభివృది చెందుతుందన్నారు. సిఎం చంద్రబాబు పనితీరు పట్ల ఆకర్షితులైన పెట్టుబడి దారులు ఆంధ్రరాష్ట్రం దారి పట్టారన్నారు. సీఎం చంద్రబాబు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కోసం నిరంతం కృషి చేస్తున్నాడన్నారు. మాజీ సీఎం జగన్ సామాజిక సృహ అంటూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించి నట్లుగావుందన్నారు. సొంత చెల్లి,తల్లిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే పోస్టులు పెట్టిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ జగన్ ఇంకిత జ్ఞానంలేకుండా మాట్లాడం విడ్డూ రంగా వుందన్నారు. రుషికొండపై నిర్మించిన భవనాల వల్ల రాష్ట్రఖజానాకు కూ. 500 కోట్ల నష్టం కల్గినందున. ఈ విషయంలో అక్రమాలకు పాల్పడి ప్రజా ధనాన్నిందుకు సాగుతున్నారని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ముందుగా గుంటి గంగా భవాని అమ్మవారిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు బి. ఓబుల్ రెడ్డి, టీడీపీ నేతలు శాగం కొండా రెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, గొందిరమణారెడ్డి(సమర) ,రాచకొండ వెంకట రావు, పిన్నిక రమేష్, మారాబత్తుల సుజాత, నుసుం ఆదినారాయణరెడ్డి, అన్వర్, పుల్లారెడ్డి, యాడిక శ్రీకాంత్ రెడ్డి, యాతం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *