శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళు, ప్రజలు ఎక్కువగా సంచరించే, నిరంతరం రద్దీగా ఉండే ప్రదేశాలలో ‘విజిబుల్ పోలీసింగ్’ నిర్వహించారు.
పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమై శాంతిభద్రతలు/ ట్రాఫిక్ సమస్యలు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నారు.
ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తూనే హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్ తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై ఎం.వి చట్టంప్రకారం చర్యలు తీసుకున్నారు.
ప్రజలకు ట్రాఫిక్ రూల్స్, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి అతిక్రమణలపై అప్రమత్తం చేస్తూ, వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణా జరగకుండా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.




