తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ సోదరుడు ఇండియన్ ఆయిల్ బంక్ అధినేత మేకల సృజన్ వివాహానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధూ వరులు సృజన్- అమృత వర్షిణిలకు దీవేనలు అందించారు. రిటైర్డ్ సొసైటీ బ్యాంకు ఉద్యోగి మేకల నాగేశ్వర రావు, సర్పంచి మేకల చార్లేస్ సర్జన్, స్థానిక వై సీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మేకల వారి ఇంట పెళ్లి సందడి …
సర్పచి సోదరుడు, సీనియర్ నాయకుడు నాగేశ్వర రావు కుమారుడు సృజన్ వివాహ సమయంలో అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిథులు, నాయకులు పాల్గొని నూతన వధూవరులకు దీవేనలు అందించారు. దీంతో తాళ్లూరులో పెళ్లి ఇంట రాజకీయ సందడి నెలకొన్నది.

