గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణా
ళిక కోసం ఒక రోజుజరిగిన శిక్షణ కార్యక్రమానికి అధికారులు సమాచారం ఇవ్వలేదంటూ ఎంపీపీ, జడ్పీటీసీ పలువురు ప్రజాప్రతినిధులు హజరు కాలేదు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళి క(జీపీడీపీ)పై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు ఆయా గ్రామ సర్పంచ్ ల కు ప్రజా ప్రతినిధులకు శిక్షణ వున్నట్లు స్పష్ట మైన సమాచారం ఇవ్వక పోవటంతో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హజరు కానట్లు సమచారం. గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధంచేసేందుకు ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు, గ్రామ సర్పంచ్ ల కు శిక్షణ నిర్వహించాలని సూచింది. స్థానిక మండల పరిషత్ అధికారులు ఎంపీపీ, జడ్పీటీసీలకు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల సర్పంచ్ లు , ఎంపీటీసీ లు, కోఆప్సన్ సభ్యులకు సమాచారం ఇవ్వక పోవటంతో జీపీడీపీ శిక్షణకు డుమ్మాకొట్టారు. జడ్పీటీసీ, మండల కోఆప్సన్సభ్యులు, పలు సర్పంచ్ లు ఎంపీపీ చాంబర్లో నే వుండి తమకు సముచిత గుర్తింపు లేకుండా వున్నందున తాము ఎందుకు పాల్గొ నాలని గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటలనుండి తాళ్లూరు, కొర్రపాటివారిపాలెం, మల్కాపురం, విఠలాపురం, తురకపాలెం, మన్నేపల్లి, మాధవరం పంచాయితీలకు
మల్కాపురం, విఠలాపురం, తురకపాలెం, మన్నెపల్లి, మాధవరం పంచాయితీలకు శిక్షణ జరగాల్సివుండగా కొర్రపాటివారిపాలెం సర్పంచ్ ఒక్కరే హజరు కావటంతో 11.30 గంటకు శిక్షణ ప్రారంభించారు. మద్యాహ్నం తూర్పుగంగవరం, బెల్లకొండవారిపాలెం, దోసకాయలపాడు, లక్కవరం, రామభద్రాపురం, నాగంబొట్లపాలెం, వెలు గువారిపాలెం, బొద్దికూరపాడు పంచాయతీలకు శిక్షణ జరుగగా కేవలం నలుగురు సర్పంచ్ లు మాత్రమే హజరయ్యారు. ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధిపై దృష్టిసా రించి పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ నిర్వహిస్తుంటే స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులకు సక్రమంగా సమాచారం ఇవ్వక పోవటంతో ప్రజా ప్రతి నిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయినుండి మండల స్థాయి అధికారుల వరకు ప్రజా ప్రతినిధులను చులకనగా చూస్తున్నారని అంటున్నారు. ఇద్దరు ముగ్గురు మండల స్థాయి అధికారులు మినహా ఎవరూహజరు కాలేదు. నీటి సం ఘాల ఎన్నికల నిర్వహణపై శిక్షణకు ఎంపీడీవో ఒంగోలు వెళ్లినట్లు తెలిసింది.
