మత్స్య కారులు మత్యశాఖ ద్వారా అమలు చేయు పథకాలపై అవగాహన పెంచుకోకొని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తాళ్లూరు -1, 2లలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. షిషరీస్ అసిస్టెంట్ వై ఎలీషా మాట్లాడుతూ తాళ్లూరు మండలంలో రెండు ఫిష్ ఆంధ్ర, ఒక మోపెడ్, 20 మందికి మత్స్య కారులకు లైసెన్సులు ఇచ్చినట్లు తెలిపారు. ఆక్వా దారులకు ఆర్ ఎస్ కే ద్వారా చేపల ఫీడ్ తక్కువ ధరకు సరఫరా చేయబడుతుందని చెప్పారు. పథకాలను గురించి తెలుసుకుని ఉపయోగించుకోవాలని కోరారు. విఏఏ నాగ రాజు నాయక్, ఎఈఓ నాగ రాజు సొసైటీ అధ్యక్షురాలు అంజమ్మ, డీఏ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
