ఆటోలు తదితర వాహనాల్లో పరిమితికి మించి కూలీలను ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సోమశేఖర్ హెచ్చరించారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను కూలీలను ఎక్కించిన పలు ఆటోలను గురువారం సోమశేఖర్ తనిఖీ చేసి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు ఆటోల్లో పరిమితికి మించి కూలీలను తీసుకువెళ్తున్నారని అన్నారు. పరిమితికి మించి కూలీలను, ప్రయాణికులను తీసుకువెళ్తున్న వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ఓవర్ లోడింగ్ తో ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు గ్రహించాలన్నారు. ప్రయాణికులు సైతం కిక్కిరిసి ఉన్న ఆటోలో ప్రయాణం చేయవద్దని సూచించారు. కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణం చేసే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణాపాయం జరుగుతుందని గాయాల పాలౌ అవుతారని తెలుసుకోవాలన్నారు . కొండపి సర్కిల్లోని కొండపి, పొన్నలూరు, మరిపూడి మండలాల్లో ట్రాక్టర్ ఆటో తదితర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వ హించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
