తాళ్లూరు-అద్దంకి వెళ్లే మార్గంలో
స్మశానం పక్క గుండా పొలాలకు వెళ్లేందుకు సైడు కాలువ పైపులు పూడి ఇబ్బంది కరంగా వుండటంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పూడిక తీత పనులు శుక్ర వారం నిర్వహించారు. ప్రొక్లెయిన్ తో ఎత్తు తక్కువలో వున్న సిమెంట్ పైపులను తొలగించి మురుగు నీరు నిల్వ వుండకుండా చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే….. తాళ్లూరు గ్రామంలో స్మశానం పక్కగా వున్నమార్గంగుండా రైతాంగం నిత్యం వ్యవసాయ పనుల కోసం రాకపోకలు సాగి స్తుంటారు. ఈ మార్గంలో స్మశానం సమీపాన మురుగునీరు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేశారు. కుంకుపాడు రోడ్డు ఎత్తుగావేయటం, పైపులు పూడి పోవటం తో మురుగునీరు దిగువకు వెళ్లక పైపుల పైగుండా ప్రవహిస్తున్నది. దీంతో నిత్యం పోలాలకు వెళ్లే రైతాంగం రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. గ్రామ టీడీపీ యువనాయకుడు ఐ.శ్రీనివాసరెడ్డి ఈ సమస్యలను స్థానిక ఎంపీడీవో కె.సుందరరామమ్య దృష్టికి తీసుక వెళ్లి పీపుల్ లోని పూడిక తీత తీయించి, పైపులను ఎత్తులేపాలని విన్నవించారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎంపీడీవో పూడిక తీత పనులతో పాటు పైపుల ఎత్తుపెంచి సమస్యను పరిష్కరించాలని గ్రామకార్యదర్శిని ఐ.వి.రమణారెడ్డిని ఆదేశించారు.
దీంతో ఎత్తు పెంచేందుకు పైపులు తీసి మురుగు నీరు దిగువకు వెళ్లే చర్యలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి, టీడీపీ యువనాయకుడు శ్రీనివా సరెడ్డి దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. ఎంతో కాలంగా రైతాంగం ఎదుర్కోం టున్న సమస్యను పరిష్కరించటంతో రైతాంగ కష్టాలు తొలగినట్లయ్యాయి.

