అంతర్జాతీయ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవం సందర్భంగా ప్రకాశం, బాపట్ల జిల్లాలలోని దివ్యాంగులకు ఒంగోలు సంత పేట లోని డి.ఆర్ ఆర్.ఎం పాఠశాలలో డిశంబర్ 2న ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభా వంతుల జిల్లా సంక్షేమాధికారి అర్చన తెలిపారు. డిశంబర్ 3న ప్రపంచ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించబడునని చెప్పారు. ఆటల పోటీలను, వేడుకలను విజయవంతం చెయ్యాలని కోరారు. పూర్తి వివరాలను ఫోన్ నంబర్ 08592- 281310ను సంప్రదించాలని వివరించారు.
దివ్యాంగుల ఆటల పోటీలను విజయవంతం చెయ్యండి – జిల్లా విభిన్న ప్రతిభా వంతుల జిల్లా సంక్షేమాధికారి అర్చన
30
Nov