దర్శి శ్రీ హరిహరిసుత అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్తపాలెం మహిళలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వయంగా దీక్షా స్వాములకు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు వడ్డించారు.




