మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజల మనిషి – మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజల మనిషి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి కొనియాడారు. ఆదివారం నాడు ఒంగోలులో మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజల మనిషి. ఒంగోలు ఎంపీగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. రాజకీయ, వ్యాపార రంగాల్లో మాగుంట కుటుంబం తనదైన ముద్ర వేసుకుంది.పరిశ్రమలు, విద్యా సంస్థలు స్థాపించి వేలాదిమందికి ఉపాధి కల్పించారు. మాగుంట ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మంత్రి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *