నవంబర్ 16 నుండి 22 వరకు నాగాలాండ్ లోని దిమాపూర్‌లో జరిగిన 25వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని బగల్స్ (Bugles) విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన బృందంలో ఒకరైన EV. నరసింహులు (ARPC- 3929) ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ….ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు సంగీతం పట్ల ఆసక్తితో నిరంతర సాధన చేస్తూ జాతీయస్థాయిలో పతకాలు సాధించడం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణమని ప్రశంసించారు. సంగీత నైపుణ్యాలకు మెరుగుపర్చుకుంటూ భవిష్యత్తు లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు.
పోలీసుల్లో ఐక్యత, క్రమశిక్షణ, అంకితభావాన్ని పెంపొందించడంలో, పోలీసులకు మరియు సమాజానికి మధ్య బంధాలను బలోపేతం చేయడంలో పోలీసు బ్యాండ్లకు ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. పోలీస్ దళాలకు ఆదేశాలు, సంకేతాలు ఇవ్వడానికి, సమన్వయం, యుక్తి చేయడానికి మరియు మార్చ్ సమయంలో లయను అందించడానికి డ్రమ్స్, బగుల్స్ మరియు ట్రంపెట్స్ వంటి వాయిద్యాలు ఎంతో దోహపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

