తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయం
మంగళవారం ఉద్యోగులు హాజరు కాక నిర్మానుష్యం వాతావరణం ఏర్పడింది. ఎవరికి వారికి వారే యమునా తీరే అన్న చందంగా …. సమన్వయ లోపంగా వుంది తహసీల్దార్ కార్యాలయం పనితీరు. నిత్యం కార్యాలయంకు విధులకు వచ్చే తహసీల్దార్, రెగ్యులర్ డి. టి, ఒంగోలు ఆర్డీవో కార్యాలయం లో పనులు వున్నాయంటూ కార్యాలయంకు రాలేదు.
ఆర్ఎ, సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు విధులకు రాలేదు. తహసీల్దార్, డిటీలు సీనియర్ అసిస్టెంట్ కోర్టు పని పై వెళ్లారంటూ కార్యాలయంకు రాలేదు.. తహసీల్దార్ కార్యాలయంకు రాకుంటే…. కొందరు ఉద్యోగులు కార్యాలయంవైపు కన్నెత్తి చూడటం లేదు. మండల ఇంచార్జి సర్వే యర్, ఆర్ఎ,జూనియర్అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయానికి రాలేదు. దీంతో కార్యాలయంలోని కుర్చీలన్ని ఖాళీగా వున్నాయి. పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఖాళీగా వున్న కుర్చీలను చూసి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. కార్యాల యంలో రీసర్వే డీటీ, అటెండర్ మాత్రమే విధుల్లో వున్నారు. కార్యాలయంలోని సిబ్బందిఅంతా వివిధ పనులు అంటూ కార్యాలయంకు రాకపోవటం ఉద్యోగుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.


