కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలలు గడుస్తున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బి జె పి నేతలు ఆరోపించారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ మహంకాళి జిల్లా బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు ప్రయాణం హామీ మినహా మరేవీ అమలుకు నోచుకోలేదు అని ఎద్దేవా చేశారు. మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ ఆధ్వర్యం లో నిర్వహించిన బైక్ ర్యాలీలో బేగంపేట బి జీ పి నాయకులు నెమలి ఆనంద్ ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున బి జె పి కార్య కర్తలు తరలి వచ్చి బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు.ఈ ర్యాలీ లో మహంకాళి జిల్లా పరిధిలోని అన్ని డివిజన్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది..మహంకాళి జిల్లా బిజెపి ఆధ్వర్యం లో బైక్ ర్యాలీ…
03
Dec