రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ నియమాలపై యువకులకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ – రోడ్డు ప్రయాణాల్లో భద్రతా నియమాలు పాటించడం మీకు సురక్షితం… మీపై ఆధారపడ్డ కుటుంబానికి ఎంతో క్షేమకరం: జిల్లా ఎస్పీ -బాధ్యతా రాహిత్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని హితవు – ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఒంగోలు నగరంలోని మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్/రాంగ్ సైడ్ డ్రైవింగ్‌, త్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్/సరైన నెంబర్ ప్లేట్స్ డాక్యూమెంట్స్ లేని మరియు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైక్ లపై ప్రయాణిస్తూ పట్టుబడ్డ యువకులకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కౌన్సిలింగ్ నిర్వహించి, ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ నియమాలపై అవగాహన కల్పించారు.
జిల్లాలో తరచూ ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని వాహనదారులు గాయాల బారిన, మరికొందరు మృత్యువాత పడుతున్నారని, వారిలో యువకులు/మైనర్లే ఉన్నారని తెలియజేసారు. ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం కలిగే అనర్దాల, మైనర్‌ డ్రైవింగ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓవర్ స్పీడింగ్, లైసెన్స్‌, ఇన్సూరెన్స్ ఇతర కాగితాలు లేకుండా వాహనాలు నడిపేతే కలిగే ఇబ్బందులు, ప్రమాదాలు జరిగి ఆ ప్రమాదాల్లో గాయపడి, మృతి చెందిన వారి కుటుంబాలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో యువకులకు క్లుప్తంగా వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సురక్షిత ప్రయాణం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంకేతాలు, వాహనం ఎలా నడపాలి, స్పీడ్‌ లిమిట్‌, హెల్మెట్‌ వాడకం, డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను అర్థమయ్యేలా అవగాహన కల్పించారు.
డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్‌ లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని, బైక్ లకు అధిక శబ్దం వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్లతో ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమవయ్యేలా ప్రయాణిస్తే ఉపేక్షించమన్నారు. బాధ్యతా రాహిత్యంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని సూచించారు. నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు.

అంతే కాకుండా యువకులకు ఓటీపీ, కొరియర్స్, ఫేక్ లోన్ యాప్స్, కేవైసీ పెండింగ్, ఫేక్ లింక్స్, ఆన్లైన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్ మొదలైన సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఒకవేళ సైబర్ క్రైమ్ లో బాధితులయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా పోలీసులకు పిర్యాదు చెయ్యాలన్నారు. అలాగే వారి బంధువులు, స్నేహితులకు సైబర్ మోసాల గురించి తెలియజేయాలన్నారు. విద్యార్థులు, యువత మందు, మాదకద్రవ్యాలు వారి దరి చేరనీయరాదని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోని చక్కగా చదువుకోవాలని, వారికీ నచ్చిన రంగంలో రాణిస్తూ బంగారు జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఆర్ ఎస్సైలు అస్లామ్, మాల్యాద్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *