తాళ్లూరు మండలంలో నీటి సంఘాల ప్రాదేశిక ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిసాయి. నాగంబొట్ల పాలెం మేజర్ పరధిలో 12 ప్రాదేశికాలకు గాను 8 ప్రాదేశికాలకు మాత్రమే ఎన్నిక జరిగినది. మిగిలిన నాలుగు ప్రాదేశికాలలో అధికార పార్టీలో గ్రూపుల గోల వలన ఎన్నికలలో ఎవరూ పాల్గొనక పోవటంతో వాయిదా పడినది. మండలం మొత్తంలో 8 మేజర్లుకు నాలుగు ఎంఐ ట్యాంక్ ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి అధ్యక్ష,ఉపాధ్యక్షులకు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధికార పార్టీ మాత్రమే ఈ ఎన్నికలలో పాల్గొనటంతో పలు చోట్ల గ్రూపులను ఎకం చేసి ఎకాభిప్రాయం సేకరించేందుకు దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ నాయకులతో చర్చలు జరిపారు.
ప్రాదేశికాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులు వీరే ….
బొద్దికూరపాడు -1 కు అధ్యక్షులుగా ఎదురూరి చిన కోటి రెడ్డి, ఉపాధ్యక్షులుగా పొలం రెడ్డి పెదనాగి రెడ్డి లు, బొద్దికూరపాడు-2కు అధ్యక్షులుగా సాగం నరసింహా రెడ్డి, ఉపాధ్యక్షులుగా పోలం రెడ్డి నాగి రెడ్డిలు, నాగంబొట్ల పాలెంకు అధ్యక్షుడిగా బెల్లం కొండ శ్రీను, ఉపాధ్యక్షుడిగా కొణికి శ్రీనివాస్, సోమవరప్పాడు కు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నారిపెద్ది మధురవేణి, సూరనేని గాయిత్రి లు, మన్నేపల్లి -1కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కుమ్మిత క్రిష్ణా రెడ్డి, మానం శ్రీనవాస రావు, మన్నేపల్లి -2కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా అంకేపల్లి సుబ్బా రెడ్డి, అంబటి గాలి రెడ్డిలు, తాళ్లూరు-2 కు అధ్యక్షుడి గా తూము శివ నా గిరెడ్డి , ఉపాధ్యక్షుడిగా సుబ్బా రెడ్డిలు, తాళ్లూరు-1కు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వీరమాసు శ్రీనివాస రావు, కోమటి గుంట వెంకటేశ్వర్లు లు.
మైనర్ ట్యాంకులకు బొద్దికూరపాడు -3 కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా గజ్జల బాలి రెడ్డి, బాపనపల్లి పుల్లయ్య లు, మన్నేపల్లి-3కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా చంద్రగిరి తిరుపతి రెడ్డి, కాడ్రేడ్డి శ్రీనివాస రెడ్డిలు, లక్కవరం -1 (చిన చెరువు) కు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా తూము లక్ష్మి రెడ్డి, మువ్వా వెంకటేశ్వర్లులు లక్కవరం -2 కు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఆవుల ఆదినారా యణ, తాటికొండ వెంకటరావులు ఎక గ్రీవంగా ఎన్నికైనారు. ఆయా సంఘాల ఎన్నికల అధికారులుగా తహసీల్దార్ సంజీవ రావు, ఎంపీడీఓ సందర రామయ్య, వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎంఈఓ -1 జి సుబ్బయ్య, ఎంఈఓ – సుధాకర రావు, డిప్యూటి తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఎఈ లు సుబ్బా రావు, కిరణ్ కుమార్, కోటేశ్వ. రావు, రామ కుమార్, శంకర రావు, ఈశ్వర రెడ్డి లు వ్యవహరించారు. ఎన్నికల వ్యవహార శైలిని మండల టిడిపి పార్టీ నాయకులు ఆయా గ్రామాలలో పర్యవేక్షించారు.





