తాళ్లూరు మండలంలోని గుంటిగంగాభవానిపుణ్యక్షేత్రం పరిధిలోని కాశినాయనస్వామి దేవాలయాల్లో ఆదివారం కాశినాయన ఆరాధనమహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నిత్యం కాశినాయన ఆల లయాల వద్దఅన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. కాశినాయనస్వామి ఆరాధన మహోత్సవం సందర్భముగా కాశినాయనను ప్రత్యేకంగా అలంకరించారు.ఉదయం 7గంటల సమయంలో గణపతి పూజ, ప్రత్యేక అభిషేకాలు జరిపారు.భక్తులు కాశినా యనకు భజనకార్యక్రమాలు నిర్వహించారు. పరిసర గ్రామాల మహిళా కళాకా రులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కోలాట ప్రదర్శన నిర్వహించారు. హరికథ కాలక్షేప కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు కాశినాయనను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ రెండు ఆలయాల వద్ద భక్తులకు అన్నదానకార్యక్రమం చేపట్టారు.


