పవిత్ర పుణ్యక్షేత్రమైన గుంటిగంగదేవస్థాన అదనపు ఎగ్యుకుటివ్ అధికారి ( ఈ. ఓ )గా తాళ్లూరు మండల దేవాలయాల గ్రూప్ లో వివిధ దేవాలయాలకు ఈవోగా వున్న గుంటుపల్లి వాసుబాబు ఆదివారం బాద్య తలు స్వీకరించారు. ఇక్కడ పని చేయుచున్న ఈవో కార్తిక్ కందుకూరు మండల దేవాలయాల గ్రూప్ కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో వివిద దేవాలయాల ఈవోగా పనిచేస్తున్న వాసుబాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికా రులు ఉత్తర్వులు జారీ చేయటంతో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుంటిగంగ దేవస్థాన కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మంతదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గుంటిగంగమ్మ దేవస్థాన అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
